Authorised Max Life Insurance Advisor & Agent

ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కాదు..
పెట్టుబడి మరియు రక్షణ కూడా..​

చూద్దాంలే, చేద్దాంలే అని అందరిలా మిగిలిపోకండి. వెంటనే ఇన్సూరెన్స్ తో మీ కుటుంబానికి రక్షణ ఇవ్వండి.

Insurance for Your Family

దేవుడు కూడా ఆదుకోలేని కఠిన సమయాల్లో మీ కుటుంబానికి రక్షణ ఇచ్చే ఏకైక ఆర్ధిక భరోసా...
... ఇన్సూరెన్స్ మాత్రమే...

కుటుంబ రక్షణ, పిల్లల చదువు, పెళ్లి, సొంత ఇల్లు, పాపకి బంగారం, విహార యాత్రలు, పొదుపు, పెట్టుబడి, రిటైర్మెంట్...
-
అవసరం ఏదైనా సమాధానం ఒక్కటే...!!!

కుటుంబ రక్షణ

ప్రమాద భీమా

healthcare small icon

ఆరోగ్య భీమా

పిల్లల చదువు

పిల్లల పెళ్లి

సొంత ఇల్లు

బంగారం / నగలు

విహార యాత్రలు

పొదుపు / పెట్టుబడి

ఉద్యోగ విరమణ

ఇప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారా ?​

మీకు మంచి రాబడి ఇచ్చే Insurance Policy తీసుకుని,
మీకు & మీ కుటుంబానికి ఇప్పుడే ఆర్ధిక రక్షణ మరియు భరోసా ఇవ్వాలనుకుంటున్నారా ?

మనం వాడి వదిలేసే ఫోన్, బైక్, కార్లకి ఇన్సూరెన్స్ ఉంది. మరి అన్నిటికన్నా విలువైన మీ లైఫ్ కి మరియు కుటుంబానికి ఇన్సూరెన్స్ ఉందా?

జీవితంలో సంపాదన మొదలు పెట్టిన తర్వాతా మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం జీవిత బీమా. మనకు అనువైన పాలసీని ఎంచుకుని భవిష్యత్తును భద్రం చేసుకోవాలి. తక్కువ ప్రీమియంతో, ఎక్కువ రిస్క్ కవరేజి అందించడం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రత్యేకత. ఏదైనా అనిశ్చితి తలెత్తినప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అలాంటి టర్మ్ పాలసీలను ఎంచుకోవడంలో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. తమకు ఎలాంటి టర్మ్ పాలసీ అనువైనదని తెలుసుకోలేకపోతుంటారు. అలాంటి వారు ఈ విషయాలు తెలుసుకుని తమకు ఏది బెస్ట్ అనే విషయాన్ని గ్రహించాలి. టర్మ్ పాలసీల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Get Insurance Quote

Get Insurance Quote

ఖర్చుపెట్టి EMIలు కడుతూ ఉండిపోకండి.
ఇన్సూరెన్స్ లో పొదుపు చేసి ధర్జాగా ఖర్చు పెట్టండి.

సంపాదన మొదలైన వెంటనే ఇన్సూరెన్స్ తీసుకోండి..

సాధారణ జీవిత బీమా పథకాలతో పోలిస్తే టర్మ్ బీమా ప్లాన్‌ల ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని మరింత తగ్గించుకోవచ్చు. ఎంత చిన్న వయస్సులో టర్మ్ ప్లాన్ తీసుకుంటే ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. మీకు ఇప్పుడు 18 సంవత్సరాలు, 60 సంవత్సరాలకు కోటి రూపాయల టర్మ్ ప్లాన్ తీసుకుంటే, అటువంటి ఉత్పత్తులు మీ కోసం వెయ్యి రూపాయల కంటే తక్కువ నెలవారీ ప్రీమియంతో అందుబాటులో ఉంటాయి. పెరుగుతున్న వయస్సుతో టర్మ్ బీమా ప్రీమియంలు కూడా పెరుగుతాయి.

దీర్ఘకాలిక రుణం తీసుకున్న వారికి టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా రుణం తీసుకుని ఇల్లు కొనే వారు తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలని సూచించింది. అటువంటి పరిస్థితిలో రుణ మొత్తానికి సమానమైన టర్మ్ బీమా అవసరం.

 

ఊహించని విపత్తుల నుండి రక్షణ పొందేదుకు మీరు సిద్ధంగా ఉన్నారా ?

Covid Insurance Protection

Covid 19, Lockdown, Job Layoffs వంటి ఊహించని విపత్తులను ఎదుర్కొనేందుకు మీరు ముందు జాగ్రత్త తీసుకుంటున్నారా ?

Covid Pandemic సమయంలో ఎంతోమంది వైద్య ఖర్చుల కోసం అవస్థలు పడటం మనము చూసాం. ఆర్ధిక రక్షణ లేక చిన్నాభిన్నం అయినా కుటుంబాలు ఎన్నో.. ఇటువంటి పరిస్థితులు రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవటం తెలివైన వారి లక్షణం. Covid 19 తర్వాత ఇన్సూరెన్స్ మీద ఆసక్తి చూపించేవారి సంఖ్య ఎక్కువయింది. ఇది జగమెరిగిన సత్యం. మీరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవటం ద్వారా ఇటువంటి విపత్తుల నుండి ఆర్ధిక రక్షణ మరియు భరోసా పొందండి. 

Max Life Insurance SWAG PAR
Max Life Insurance SWAG PAR Insta Income

Insurance Investment Plansతో మీ పిల్లల స్కూల్ చదువు సున్నా ఖర్చుతో పూర్తి చేయవచ్చు.

మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి. ఇప్పుడు LKGకే లక్షల్లో ఫీజులు ఉంటున్నాయి. మరి మీ పిల్లల ఫీజులకి మీకు వచ్చే వేతనాలు సరిపోతున్నాయా ? Insurance Investment Plansతో మీ పిల్లల స్కూల్ చదువులు సున్నా ఖర్చుతో పూర్తి చేయవచ్చు. అంతేకాదు డిగ్రీ, డాక్టర్, ఇంజనీర్ లాంటి పెద్ద చదువుల కోసం పెద్దమొత్తంలో మీరు కట్టిన ఇన్సూరెన్స్ అమౌంట్ ని వెనక్కి పొందవచ్చు. మరిన్ని వివరాలు కొరకు వెంటనే మమ్మల్ని సంప్రదించండి.

మీరు పెట్టే అతి చిన్న పెట్టుబడులే..
మీకు మరియు మీ పిల్లల రేపటి భవిష్యత్తుకి భరోసా ..


Examples

Case 1

Case 2

Case 3

Case 4

Plan

SWAG PAR – Future

SWG PAR – Insta Income

SWAG PAR – Balanced Income

SWAG PAR – Lifelong Income

Policy Premium

200000 / year

240000 / year

50000 / year

50000 / year

Premium Payment Term
   
10 Years   
   
10 years   
   
12 Years   
   
12 Years   

Total Policy Term
   
20 years   
   
25 Years   
   
65 Years   
   
65 Years   

Total Premium
   
20 Lakhs   
   
24 Lakhs   
   
6 Lakhs   
   
6 Lakhs   

Total Benefit (Return)
   
49.08 Lakhs   
   
54.66 Lakhs   
   
1,05,60,420   
   
92,33,340   

Cash Bonus from

From 11th Year

From End of 1st Year

From End of 1st Year

From End of 1st Year

Best For

Child Education

Savings

Multiple Needs

Retirement

మీకు, మీ కుటుంబానికి రక్షణ మరియు భరోసా ఇవ్వటానికి ఇన్సూరెన్స్ చేయాలనుకునే వారు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నంబర్స్.

అసలు Term Insurance అంటే ఏంటి?

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ (Term Insurance) అనేది ఒక నిర్దిష్ట కాల వ్యవధికి సరసమైన ప్రీమియం రేటుతో పాలసీదారు కుటుంబానికి ఆర్థిక రక్షణను అందించే సులభమైన జీవిత బీమా. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో, మీరు తక్కువ కోట్ ప్రీమియం రేట్లలో సమగ్ర జీవిత రక్షణను పొందవచ్చు. బీమా చేయబడిన వ్యక్తి పాలసీ వ్యవధిలో మరణిస్తే నామినీకి హామీ మొత్తం లేదా మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే మీరు లేని రోజు మీ కుటుంబానికి ఆర్థికంగా రక్షణ ఇచ్చే కవచం.

Term Insurance యొక్క ప్రయోజనాలు

ఖర్చుపెట్టి EMIలు కడుతూ ఉండిపోకండి.
ఇన్సూరెన్స్ లో పొదుపు చేసి ధర్జాగా ఖర్చు పెట్టండి.
చిన్న పెట్టుబడి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది

Term Insurance ఎందుకు తీసుకోవాలి ? మనల్ని & మన కుటుంబాన్ని ఎలా కాపాడుతుంది ?

ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల మీకు & మీ కుటుంబానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో జీవిత బీమా పాలసీ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయింది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో విషాదానికి గురైతే ఆర్థిక భరోసానిచ్చేందుకు ఈ బీమా పాలసీలను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిలో టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ టర్మ్ ప్లాన్స్ ద్వారా కుటుంబ భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడమే కాకుండా పదవీ విరమణ తర్వాత ఆర్థిక ప్రయోజనాలు అందించేందుకు కూడా ఉపయోగపడతాయి.

బీమా ప్రీమియం తిరిగి వ‌స్తుందా?

ట‌ర్మ్ ప్లాన్‌లో బీమా చేసిన వ్య‌క్తి పాల‌సీ వ్య‌వ‌ధి పూర్తయ్యేవరకు జీవించి ఉన్న‌ట్ల‌యితే.. పాల‌సీ మెచ్యూరిటీ అనంత‌రం బీమా కంపెనీ ఎలాంటి చెల్లింపులూ చేయ‌దు. కానీ చాలా బీమా సంస్థ‌లు ‘రిట‌ర్న్ ఆఫ్ ప్రీమియం’తో కూడిన ట‌ర్మ్ ప్లాన్‌ల‌ను కూడా ఇస్తున్నాయి. ఇక్క‌డ పాల‌సీదారుడు పాల‌సీ వ్య‌వ‌ధిలో జీవించి ఉన్నా కూడా వారు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని బీమా కంపెనీలు తిరిగి ఇచ్చేస్తాయి. ఈ పాల‌సీల్లో ప్రీమియం అధికంగా ఉంటుంది. అధిక ప్రీమియం చెల్లించే బదులు సాధారణ టర్మ్ పాలసీ తీసుకుని మిగిలిన మొత్తాన్ని మంచి పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి నిధి సమకూర్చుకోవచ్చు.

ట‌ర్మ్ బీమా అవ‌స‌రం

ఇప్ప‌టికే పెట్టుబ‌డుల‌తో కూడిన వివిధ జీవిత బీమా పాల‌సీలు ఉన్న‌ప్ప‌టికీ, వాటికి త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ ఆర్థిక ర‌క్ష‌ణ ఇచ్చే ట‌ర్మ్ జీవిత బీమాను కూడా జత చేయడం చాలా మంచిది. ట‌ర్మ్ బీమా పాల‌సీని కొనుగోలు చేసేట‌ప్పుడు.. క‌వ‌రేజీ మొత్తానికి లెక్క‌లు వేసుకోవ‌డం చాలా ముఖ్యం. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్లు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా భవిష్యత్‌లో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులూ తలెత్తకుండా ఉంటాయి. పాల‌సీ వ్య‌వ‌ధిలో పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి అకాల మ‌ర‌ణం సంభ‌విస్తే.. ఇది పాల‌సీదారుపై ఆధార‌ప‌డ్డ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ప‌డ‌కుండా కాపాడుతుంది.

పాల‌సీ కొనుగోలు జాగ్ర‌త్త‌లు

ట‌ర్మ్ జీవిత బీమా పాల‌సీని కొనుగోలు చేసే ముందు.. మొత్తం కుటుంబానికి సంబంధించిన ఆర్థిక బాధ్య‌త‌లు, రుణాలు, భ‌విష్య‌త్‌ ఖ‌ర్చుల‌ను స‌రిగ్గా అంచ‌నా వేయాలి. ఒక వ్య‌క్తి చిన్న వ‌య‌సులోనే ట‌ర్మ్ బీమా పాల‌సీను పొందితే ప్రీమియం సాధార‌ణంగా త‌క్కువ ఉంటుంది. మీరు ట‌ర్మ్ బీమాను కొనుగోలు చేస్తున్న‌పుడు.. పాల‌సీ ప్ర‌యోజ‌నాలు, ఫీచ‌ర్లు, ప్రీమియం, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్ప‌త్తి ఆధారంగా వివిధ బీమా కంపెనీల పాల‌సీల‌ను స‌రిపోల్చుకుని పాల‌సీ ఎంపిక చేసుకోవాలి.

పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ‌

బీమా ప్రీమియంను గ‌డువు తేదీలోపు చెల్లించాలి. పాల‌సీదారులు ప్రీమియం నెల‌వారీగా చెల్లించిన‌ట్ల‌యితే గ‌డువు తేదీ త‌ర్వాత 15 రోజులు; త్రైమాసిక‌, అర్ధ వార్షిక‌, వార్షిక ప్రీమియం చెల్లించిన‌ట్ల‌యితే 30 రోజులు గ‌డువును బీమా కంపెనీలు ఇస్తాయి. గ‌డువు స‌మ‌యంలో పాల‌సీదారుకు ఏదైనా జ‌రిగితే.. నామినీ బీమా హామీ క్లెయిమ్ చేయ‌డానికి అర్హ‌త ఉంటుంది. అయితే, గ్రేస్ పీరియడ్లో కూడా ప్రీమియం చెల్లించ‌క‌పోతే, పాల‌సీ ర‌ద్దవుతుంది. పాల‌సీపై ఎటువంటి ప్ర‌యోజ‌నాలు అంద‌వు. ట‌ర్మ్ బీమా పాల‌సీ ప్రీమియంను ఏక‌మొత్తంగా క‌ట్ట‌డం క‌న్నా క్రమంగా క‌ట్టే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

ట‌ర్మ్ పాల‌సీలో రైడ‌ర్లు

ట‌ర్మ్ జీవిత బీమాలో అద‌న‌పు ఆరోగ్య ర‌క్ష‌ణ‌ను పొంద‌డానికి రైడ‌ర్‌ల‌ను కూడా తీసుకోవ‌చ్చు. ఈ రైడ‌ర్‌లు ప్రాథ‌మిక జీవిత క‌వ‌రేజీతో పాటు చౌకైన అద‌న‌పు ప్రీమియంతో ల‌భిస్తాయి. క్యాన్స‌ర్‌, స్ట్రోక్‌, గుండెపోటు లేదా శ‌రీరంలో అనేక అవ‌య‌వాలు ప‌నిచేయక‌పోవ‌డం వంటి రోగాల‌తో అనారోగ్యానికి గురైతే క్రిటిక‌ల్ ఇల్‌నెస్ రైడ‌ర్‌తో కూడిన ట‌ర్మ్ ప్లాన్ పాల‌సీదారుకు ఏక‌మొత్తంలో డ‌బ్బు చెల్లిస్తుంది. ఐఆర్డీఏ నియమాల ప్రకారం ఎంచుకున్న రైడ‌ర్‌ల ప్రీమియం ప్రాథ‌మిక ట‌ర్మ్ బీమా ప్రీమియంకు 30% మించ‌కూడదు.

యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్‌ రైడ‌ర్

ఈ ట‌ర్మ్ బీమా పాల‌సీతో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్‌ (ప్ర‌మాద మ‌ర‌ణ) రైడ‌ర్‌ను క‌లిగి ఉంటే.. పాల‌సీదారు ఏదైనా ప్రమాదంలో మ‌ర‌ణించిన సంద‌ర్భంలో పాల‌సీ ప్రాథ‌మిక హామీ మొత్తంతో పాటు నామినీకి ప్ర‌మాద మ‌ర‌ణ హామీ మొత్తాన్ని కూడా బీమా కంపెనీలు చెల్లిస్తాయి.

శాశ్వత వైకల్యం రైడ‌ర్

ఈ ప‌ర్మ‌నెంట్ డిసేబిలిటీ (శాశ్వ‌త అంగవైక్య‌ల్యం) రైడ‌ర్‌లో ప్ర‌మాదం కార‌ణంగా బీమా కలిగిన వ్య‌క్తి శాశ్వ‌తంగా అంగ‌వైక‌ల్యానికి గురైతే, నిర్దేశిత సంవ‌త్స‌రాల పాటు ప‌రిహారంగా కొంత శాతాన్ని బీమా కంపెనీ ప్ర‌తి నెలా చెల్లిస్తుంది. దీంతో పాటు భవిష్యత్‌లో చెల్లించాల్సిన ప్రీమియంలు కూడా రద్దు చేస్తుంది.

ఎక్కువ మంది నామినీలు

ఈ ట‌ర్మ్ బీమాలో కుటుంబ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు నామినేష‌న్ ప్ర‌క్రియ కీల‌కం. ఇందులో ఒక్క‌రినే కాకుండా బ‌హుళ నామినీల‌ను కూడా పేర్కొన‌వ‌చ్చు. త‌ల్లిదండ్రులు, భార్య, పిల్ల‌లను కూడా బ‌హుళ నామినీలుగా పాల‌సీదారుడు పేర్కొన‌వ‌చ్చు. అంతేకాకుండా, హామీ మొత్తం అందే సమయంలో సమస్యలు తలెత్తకుండా నామినీల మ‌ధ్య పంపిణీ చేయాల్సిన బీమా శాతాన్ని కూడా పాల‌సీదారుడు పేర్కొన‌వ‌చ్చు.

InsuranceZone.in ద్వారానే ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి ?

చట్టబద్ధంగా ఆదాయం మీద పన్ను నుండి విముక్తి పొందే ఏకైక మార్గం - ఇన్సూరెన్స్...!!!

ఇప్పుడు చాలా మంది పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా చేయడానికి టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకుంటున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ ముందుగా ఆదాయపు పన్ను గురించి మాట్లాడుకుందాం. పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను చట్టం కింద అనేక రకాల మినహాయింపులు, తగ్గింపుల ప్రయోజనాలను పొందుతారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C టర్మ్ ఇన్సూరెన్స్‌పై పన్ను ఆదా సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులు 1.50 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.

మరణ ప్రయోజనం కూడా పన్ను మినహాయింపు:

టర్మ్ ఇన్సూరెన్స్ పన్ను ప్రయోజనాలు దీనికి మాత్రమే పరిమితం కాదు. మీకు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, టర్మ్ ఇన్సూరెన్స్ మీపై ఆధారపడిన వారికి రక్షణను అందిస్తుంది. దీని కింద పాలసీ నామినీ మరణ ప్రయోజనాన్ని పొందుతాడు. నామినీ ఈ విధంగా పొందే మొత్తం కూడా పూర్తిగా పన్ను రహితం. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10సీలో చర్యలు తీసుకున్నారు.

భవిష్యత్తు ప్రణాళిక కోసం అవసరం

మీరు మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇందులో కూడా సహాయపడుతుంది. భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేయడంలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చాలా ముఖ్యమైనది. ఇది భవిష్యత్ భద్రతను మాత్రమే కాకుండా, ప్రీమియం భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది సాధారణ జీవిత బీమా కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. జీవిత బీమాతో పోలిస్తే దీని ప్రయోజనాలు కూడా భిన్నంగా ఉంది.

మనలో చాలా మంది బాగా సంపాదించి భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని గడపాలని ఆలోచిస్తూ అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అందుకు ఉద్యోగం లేదా వ్యాపారం అంటూ బిజీ బిజీగా పరుగులు తీస్తున్న తరుణంలో ఇక మనం సంపాదించి కూడబెట్టినది ఎంత? 

ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క క్షణం ఆలోచించండి. బంగారు భవిష్యత్తు కోసం కలలు కనేవారికీ 

నెల వారి ఆదాయం..

టర్మ్ ప్లాన్ ద్వారా నెల నెల కొంత ఆదాయం అందాలనే వారు ఇలాంటివి ఎంచుకోవచ్చు. ఇందులో 10-15 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లింపులు ఉంటాయి. పాలసీ హోల్డర్ కుటుంబానికి 10-15 ఏళ్ల వరకు నెల నెల కొంత చెల్లిస్తుంటాయి బీమా సంస్థలు. ఇందులోని కొన్ని ప్లాన్స్ ద్రవ్యోల్బణం ఆధారంగా పేమెంట్స్ ను 10 శాతం వరకు పెంచి చెల్లించే విధంగా ఉంటాయి. ఆర్థిక పరమైన అవగాహన తక్కువగా ఉన్న వారికి ఇలాంటి ప్లాన్స్ మంచి అవకాశం. అలాగే.. ఒకేసారి పెద్ద మొత్తంలో అందే డబ్బులను హ్యాండిల్ చేయలేని వారికి సైతం ఇది మంచి ఆప్షన్ అనే చెప్పాలి.

మీకు, మీ కుటుంబానికి రక్షణ మరియు భరోసా ఇవ్వటానికి ఇన్సూరెన్స్ కొరకు వెంటనే సంప్రదించండి.

ఇప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారా ?​

మీకు మంచి రాబడి ఇచ్చే Insurance Policy తీసుకుని, మీకు & మీ కుటుంబానికి ఇప్పుడే ఆర్ధిక రక్షణ మరియు భరోసా ఇవ్వాలనుకుంటున్నారా ?

ఇన్సూరెన్స్ తీసుకొనుటకు మీకు ఎందుకు ఆసక్తి లేదో తెలుసుకోవచ్చా ?

ఇన్సూరెన్స్ గురించి మీకు మరింత అవగాహన కల్పించుటకు మీ వివరములు ఇవ్వండి.